ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉపాధి నర్సరీని పరిశీలించిన కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా హనుమంత్ కే జెడంగే

WhatsApp Image 2024-07-26 at 16.39.22_7d8710f3

 విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 26 :  యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఏం)మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం రోజు పరిశీలించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్  హనుమంతు కే జెండాగే. ఆరోగ్య కేంద్రంలో ఫెషెంట్లను సమయానికి డాక్టర్లు నర్సులు అందుబాటులో ఉండి సరైన చికిత్సలు అందిస్తూ ఉన్నారా లేదా అని ఆరా తీశారు. అనంతరం ఖప్రాయపల్లి గ్రామానికి వెళ్లి గ్రామంలోని ఉపాధి హామీ నర్సరీని పరిశీలించారు. నర్సరీలో ఉన్న మొక్కలను ఎల్లప్పుడూ జాగ్రత్త వహిస్తూ తగు చర్యలు తీసుకోవాలని సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ఎండీ నిరంజన్ వలీ, డిప్యూటీ తహసీల్దార్ సయ్యద్ శఫీయుద్దీన్, ఉపాధి హామీ ఏపీఓ బోడిగే రమేష్, టెక్నికల్ అసిస్టెంట్ జెమాండ్ల యాదిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సహేష్, ఏఫ్ఏ దేవరపల్లి నర్మద, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ కార్మిక సంఘం.