బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
విశ్వంభర, హైద్రాబాద్ : దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులు అర్పించిన బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ,పార్లమెంట్ సభ్యులు , బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ , మాజీ ఎంపీ బీ బీ పాటిల్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి , బిజెపి మాజీ శాసనసభ్యులు శ్రీ ప్రేమ్ సింగ్ రాథోడ్, బిజెపి రాష్ట్ర కార్యదర్శులు శ్రీమతి జయ శ్రీ, శ్రీమతి గొట్టాల ఉమారాణి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ జి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జనసంఘ్ (పూర్వ బిజెపి)పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు, పార్టీ సిద్ధాంతకర్త, ఏకాత్మతా మానవతావాద ప్రవచించిన ప్రముఖ వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ఉపాధ్యాయ. అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రవచించి పేదలకు, నిరుపేదలకు ప్రభుత్వ ఫలాలు అందాలని కోరుకున్న వ్యక్తి. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలకు అనుగుణంగా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంతరం పనిచేస్తున్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పేదల ప్రభుత్వంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన సిద్ధాంతం అనుగునంగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. సమాజంలో చిట్టచివరి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందాలని పేదలో అత్యంత పేదవారికి దేశ సంపద ఫలాలు అందాలని పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కలల సహకారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
కుల,మత, వర్గ బేదం లేకుండా అందరికీ నేరుగా ఫలాలు అందేలా దళారి వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలు డిజిటల్ మార్గం ద్వారా అందజేస్తున్నారు.
సెప్టెంబర్ 17 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం నుండి సెప్టెంబర్ 25 పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి, అక్టోబర్ 2 మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పక్షం రోజులు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా పిలుపుమేరకు పోలింగ్ బూత్ స్థాయి వరకు బిజెపి కార్యకర్తలు, నాయకులు రక్తదాన శిబిరాలు, పేదలకు మెడికల్ క్యాంపు ల రూపం లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Party with Difference అనే నినాదంతో కార్యకర్తల నిర్మాణంతో, సిద్ధాంతం ఆధారంగా బిజెపి పని చేస్తున్నది.
అధికారం కోసం, ఎన్నికల కోసం, ప్రజా ప్రతినిధులు కావాలనే ఉద్దేశంతో కాకుండా రాజకీయాలు చేయడం లేదు. రాజకీయ పార్టీ అంటే సేవా కార్యక్రమాలు ప్రధానమని దాని ద్వారానే ప్రజలకు చేరువ కావాలని భావిస్తున్నాం.
సేవా కార్యక్రమాల ద్వారానే పార్టీని ప్రతిష్టపరిచి ముందుకు వెళ్లాలని సేవ హి సంఘటన్ కార్యక్రమాలను రూపొందిస్తున్నది.
దేశ సంపద మొదటగా మైనారిటీలకు దక్కలనేది కాంగ్రెస్ అజెండా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవచిస్తూ, సిద్ధాంతంగా పెట్టుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు అవినీతి కుంభకోణాలు తో కేంద్ర ప్రభుత్వాన్ని నడిపింది. ఇప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్న అవినీతి నిత్యకృత్యమైంది.
కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని సొమ్ము చేసుకుంటుంది.
కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.
కర్ణాటకలో సిద్దరామయ్య పేదలకు చెందాల్సిన భూములను ఏ విధంగా కాజేస్తున్నారు. దేశ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు హైకోర్టు సైతం ఫిర్యాదును స్వీకరించింది అంటే అర్థం చేసుకోవచ్చు.
కర్ణాటక సీఎం నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సింది పోయి చేసిన అవినీతిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మంత్రులు, ప్రభుత్వం లోని కొంతమంది అవినీతికి పెద్ద ఎత్తున పాల్పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత వస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు గ్యారెంటీలు మోసపూరితమని ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణ కూడా అంతేనని తేలి పోయింది.
హర్యానా లో ఏడు గ్యారంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కాంగ్రెస్ గ్యారంటీ అంటే ప్రజలను మోసం చేయడమే గ్యారెంటీ- అధికారంలోకి వచ్చి అవినీతితో సొమ్ము చేసుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. సొమ్ము చేసుకోవడం దోచుకోవడమే కాంగ్రెస్ గ్యారెంటీ.
పేదల అభ్యున్నతి కోసం కృషి చేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాల కోసం కార్యకర్తలు నాయకులు నిరంతరం ప్రజల్లో ఉండాలి.