సీఎం , డిప్యూటీ సీఎం చిత్ర పటాలకు పాలాభిషేకం 

సీఎం , డిప్యూటీ సీఎం చిత్ర పటాలకు పాలాభిషేకం 

మహిళా విశ్వ విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు 
హర్షం వ్యక్తం చేసిన స్టేట్ జనరల్ సెక్రటరీ సేవాదళ్ కాంగ్రెస్ టీ.నిరంజన్ 

విశ్వంభర, హైద్రాబాద్  : కోఠి లోని మహిళా విశ్వ విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం పై స్టేట్ జనరల్ సెక్రటరీ సేవాదళ్ కాంగ్రెస్ టీ.నిరంజన్ హర్షం వ్యక్తం చేసారు.ఈ సందర్బంగా కోఠి లోని మహిళా విశ్వ విద్యాలయంలో  సీఎం రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చిత్ర పటాలకు  పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా స్టేట్ జనరల్ సెక్రటరీ సేవాదళ్ కాంగ్రెస్ టీ.నిరంజన్  యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ లొ భూమికోసం -భూక్తి కోసం వెట్టిచాకిరీ -దాస్య శృంఖలాల  విముక్తికోసం,   ఎక్కడ అన్యాయం జరిగిన అక్కడ ఎదురించేవిదంగా ఎంతో మందికి పోరాట పటిమ ఉద్యమ స్ఫూర్తిని నింపిన   పోరాట తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. 

Tags: