తెలంగాణ వైద్యశాఖలో త్వరలోనే 735 పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణ వైద్యశాఖలో త్వరలోనే 735 పోస్టులకు నోటిఫికేషన్



తెలంగాణలోని నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ రాబోతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వరుసగా నోటిఫికేషన్లు వేస్తున్న క్రమంలో.. త్వరలోనే ఆస్పత్రుల్లోని ఖాళీలను కూడా పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 735 పోస్టులు  ఖాళీగా ఉన్నాయి.

Read More హిందూ సమాజం  ఏకం కావాలని రామాలయం కమిటీ  పాదయాత్ర

ఇందులో 531 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌), 193 ల్యాబ్‌ టెక్నీషియన్లు, 31 స్టాఫ్‌ నర్సు పోస్టులు ఉన్నాయి. వీటికి త్వరలోనే తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్ జారీ చేయడానికి రెడీ అవుతోంది. రేవంత్ సర్కార్ ఇప్పటికే ఆస్పత్రుల్లోని ఖాళీలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వెంటనే ఖాళీలను పూరించాలని నిర్ణయం తీసుకుంది.

మరీ ముఖ్యంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత ఎక్కువగా ఉందని సర్కార్ గుర్తించింది. కాబట్టి వాటితో పాటు మిగతా పోస్టులను కూడా భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దానిపై విద్యాశాఖ త్వరలోనే మరోసారి భేటీ కాబోతోంది. ఆ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.