శ్రీజ్యోతి స్వరూప అన్నప్రసాద సేవా సమితిని సందర్శించిన ఎంపీ వద్దిరాజు
On
శ్రీజ్యోతి స్వరూప అన్నప్రసాద సేవా
విశ్వంభర, హైదరాబాద్ :రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం మమత రోడ్డులో గురువారం శ్రీజ్యోతి స్వరూప అన్నప్రసాద సేవా సమితిని సందర్శించారు. ఎంపీ రవిచంద్ర తన సన్నిహితులు తోట వీరభద్రం, వేముల శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి సమితిని సందర్శించి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.ఎంపీ వద్దిరాజు
80వేల రూపాయలు అందజేసి అన్నప్రసాద వితరణ చేశారు. స్వాములకు స్వయంగా భోజనం
వడ్డించారు.ఈ సందర్భంగా నల్లగట్ల శ్రీనివాసరావు, బోయపాటి శ్రీను, ఆకుల వినయ్,ముత్తినేని
మురళీకృష్ణ, మామిడి నరేష్ స్వాములు ఎంపీ రవిచంద్ర, తోట వీరభద్రంలను శాలువాలతో సత్కరించి ప్రసాదం అందించారు.