ఉచిత బస్ ప్రయాణం పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆరా ..
On
ఉచిత ప్రయాణం చేసేవాళ్లము దర్జాగా కూర్చుంటున్నామని, టికెట్ తీసుకున్న వాళ్లకు సీటు దొరకడం లేదని ఒక మహిళ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ నవ్వారు....
ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళల స్పందనతో పాటు , ప్రజా సమస్యలు తెలుసుకున్న -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
సంతోషం వ్యక్తం చేసిన మహిళలు
విశ్వంభర, మునుగోడు : నియోజకవర్గం కేంద్రంలోని పలు వీధుల్లో అభివృద్ధి పనుల పరిశీలన లో భాగంగా మునుగోడు బస్ స్టేషన్ సందర్శించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అప్పుడే చౌటుప్పల్ నుండి మునుగోడు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మునుగోడు బస్టాండ్ కి రావడంతో ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళలను పలకరించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎలా ఉందని కాసేపు ముచ్చటించారు. ప్రతిరోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని డ్రైవర్ ని అడిగి తెలుసుకున్నారు. అయితే ఉచిత ప్రయాణం చేసేవాళ్లము దర్జాగా కూర్చుంటున్నామని టికెట్ తీసుకున్న వాళ్లకు బస్సులో సీటు దొరకడం లేదని ఒక మహిళ చెప్పిన మాటతో బస్సులో ఒక్కసారిగా అందరూ నవ్వారు. ఎలాంటి సమస్యలు ఉన్న నాకు చెప్పాలని బస్ లో ఉన్న మహిళలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తెలిపారు.