మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
On
విశ్వంభర, హైద్రాబాద్ : నల్గొండపై కేటీఆర్‌కు కోపం ఎందుకు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. మూసీపై చర్చకు కేసీఆర్‌ను రమ్మను అంటున్నామని , అసెంబ్లీలో కూడా చర్చకు మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతానికి కేటీఆర్ వచ్చి చూడాలి. మూసీ కంపుతో రోగాల బారినపడ్డ మాపై ఎందుకు కక్ష కట్టారో అర్ధం కావడం లేదు. మీకు ధైర్యం ఉంటే.. నేను బస్సు పెడతా మీ ఎమ్మెల్యేలతో కలిసి నల్గొండకు రా అని అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతం తిరిగివద్దాం అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.