మంత్రి ఉత్తమ్ తండ్రికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులు
On
విశ్వంభర, హైద్రాబాద్ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులు అర్పించారు. తన సహచర మంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మరణంతో విషాదంలో ఉన్న వారి కుటుంబాన్ని వారి నివాసానికి వెళ్లి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. అనంతరం పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు..