నెక్లెస్ రోడ్ లో "రన్ ఫర్ క్వాలిటీ" రన్నింగ్ పోటీలను ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్
On
మనం ఎంప్లాయిమెంట్ కోసం తపనపడాలి
దేశానికి బిగ్గెస్ట్ ఛాలెంజ్ మ్యాన్ పవర్
విశ్వంభర, హైద్రాబాద్ : ప్రపంచానికి కరువు వస్తే, ఆకలైతే అన్నం పెట్టగలిగే స్థాయికి భారతదేశం ఎదిగింది, కానీ భారత్ కి ఏమైనా అవస్థ వస్తే సాయం చేసే స్థాయి ఏ దేశం కి లేదని మేదావులు ఆర్టికల్ లో రాశారు.
కరోనా వచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా ఊహాగానాలు చేశారు.. చైనాలో వచ్చినప్పుడు వెయ్యి పడకల ఆసుపత్రిని ఆగమేఘాల మీద నిర్మించుకున్నారు, చైనా కాబట్టి తట్టుకున్నది కానీ భారత్ లో కరోనా వచ్చి ఉంటే శవాల గుట్టలు అయిపోయాయి అని మాట్లాడారు, కానీ భారతదేశమే మొట్టమొదట కరోనా వ్యాక్సిన్ తయారుచేసి ప్రపంచ దేశాలకు అందించింది.
క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే చర్లపల్లిలో కడుతున్న టర్మినల్ చూస్తే క్వాలిటీ ఏంటో తెలుస్తది. ఎయిర్ పోర్ట్ ను తలపించే పద్ధతిలో నిర్మాణం జరుగుతుంది.
రక్షణ రంగం పరికరాలలో, ఫార్మా రంగంలో, మొబైల్ ఫోన్స్ ఉత్పత్తులలో అనేక రంగాలలో దూసుకుపోతుంది భారత్.
అమెరికాలో ఉన్న డాక్టర్లలో క్వాలిటీ డాక్టర్స్ మన ఇండియన్స్. సాఫ్ట్వేర్, వైద్య రంగాలలో దూసుకుపోతుంది భారత్.
దేశంలో క్వాలిటీ మాన్ పవర్ ఉండి ఏఐ వచ్చిన తర్వాత ఇంట్లో వంట నుండి డాక్టర్ చేసే సర్జరీ వరకు రోబో చేస్తే మనం ఎక్కడికి పోవాలి... ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్.
శాస్త్ర విజ్ఞానం ఎదగాలి కానీ ఆ విజ్ఞానం మనిషిని పనిలో పెట్టాలి. మనిషి ఊరికే ఉండకూడదు ఏదో ఒక రకంగా పనిలో పెట్టాలి.
దేశానికి బిగ్గెస్ట్ ఛాలెంజ్ మ్యాన్ పవర్ ని దేశ అభివృద్ధిలో ఎలా భాగం చేయాలని చెప్పి నాలుగు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు.
మనం ఎంప్లాయిమెంట్ కోసం తపనపడాలి అదేవిధంగా ఎంప్లాయిమెంట్ కల్పించడంలో కూడా తోడ్పడాలి.
భారత జాతి కీర్తి పతాకాన్ని ముందుకు తీసుకెళ్లడంలో యువత నడు బిగించాలని కోరుకుంటున్నాను.