మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరవరణాన్ని కాపాడుదాం-: ఎస్సై జగన్ 

మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరవరణాన్ని కాపాడుదాం-: ఎస్సై జగన్ 

విశ్వంభర, నారాయణపూర్ : నారాయణపూర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో కస్తూరి ఫౌండేషన్ సౌజన్యంతో మట్టి విగ్రహాలని  ఎస్ఐ జగన్  చేతుల మీదగా పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముందుగా కస్తూరి ఫౌండేషన్ ను సేవలను అభినందించి.  ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాల వలన నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు.అందుకే ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే కస్తూరి ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి పండగ వెనకా ఓ  మహోన్నత లక్ష్యం కనిపిస్తుంది. ప్రకృతిలో మమేకమవుతూ నేలా-నీరు, చెట్టూ - పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం అనాధిగా మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతూ వస్తోంది. నిజానికి ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పదనం. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మట్టి గణపతి విగ్రహాలను కస్తూరి ఫౌండేషన్ ద్వారా అందించడం శనివారం నారాయణపూర్ మండల కేంద్రంలో 100 విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫౌండేషన్ సభ్యులు వీరమళ్ల కార్తీక్ గౌడ్, కొప్పు రామకృష్ణ, చిలువేరు సైదులు, కొల్లూరి నవీన్, జక్కడి చంద్రారెడ్డి, శంకర్, జక్కడి సుదర్శన్ రెడ్డి, యశ్వంత్, అందే నరేష్, సంజీవ, రవి, ఎలిజాల శీను, వేణు, సింగం కృష్ణ, పవన్, రాజు, వెంకటేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags: