గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. గెలుపే లక్ష్యంగా?
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఈ ఎన్నికలు ముగియగానే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బిఆర్ఎస్ మూడు పార్టీలు కూడా త్వరలోనే జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఈ ఎన్నికలు ముగియగానే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బిఆర్ఎస్ మూడు పార్టీలు కూడా త్వరలోనే జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఈ ఎన్నికలలో కూడా తమ పార్టీనే సత్తా చాటాలని మూడు పార్టీలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నాయి.
ఇప్పటికే మూడు పార్టీలు కూడా అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నుంచి బరిలోకి దిగారు. ఇండిపెండెంట్‌గా అశోక్(అశోక్ సర్) అనే వ్యక్తి పోటీ పడుతున్నారు. అయితే ఎలాగైనా ఈ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పని చేస్తున్నాయి.
ఇకపోతే పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గ్రాడ్యుయేట్ ఎన్నికలపై దృష్టి సారించారు. నల్గొండ- ఖమ్మం- వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ మూడు జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో ఈయన రేపు అనగా బుధవారం సమావేశం కాబోతున్నారు. ఇక ఈ భేటీలో భాగంగా మూడు జిల్లాలలో పార్టీ ప్రధాన నాయకులు ఎవరు మిస్ కాకూడదని అలాగే ప్రస్తుత రాజకీయాలపై కూడా చర్చలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.