గౌడ సంఘం అధ్యక్షులుగా కందాల వెంకట్రాజం గౌడ్ 

గౌడ సంఘం అధ్యక్షులుగా కందాల వెంకట్రాజం గౌడ్ 

విశ్వంభర, అర్వపల్లి :  గౌడ సంఘం అధ్యక్షులుగా కందాల వెంకట్రాజం గౌడ్ 4వ సారి అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాపై నమ్మకంతో అర్వపల్లి గ్రామ గౌడ కులస్తులు నాకు ఓటు వేసి నాలుగోసారి గెలిపించినందుకు గ్రామ గౌడ కులస్తులకు  కృతజ్ఞతలు తెలియజేశారు. అర్వపల్లి గౌడ కులస్తుల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్వపల్లి గ్రామ గౌడ కులస్తులు జునూరు నాదం, అంబాల ధనుంజయ, బైరగొని రామకృష్ణ, మేడిపల్లి రాజు, కొల సురేష్, జక్కు రాము, లక్ష్మణ్, ఇంద్రసేన, మేడిపల్లి మొగిలి, కందాల శ్రీనివాస్, కందాల వెంకటేష్, ఆకుల క్రాంతి కుమార్, మేడిపల్లి రమేష్, ఆకుల బాబు, కోయీడ శ్రీనివాస్, కరుణాకర్,తదితరులు పాల్గొన్నారు. అనంతరం అర్వపల్లి గ్రామంలో భారీ ఎత్తున బాణసంచా కాల్చి, విజయోత్సవ సంబురాలు ఆనందోత్సాహాలతో నిర్వహించారు.

Tags: