28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష

WhatsApp Image 2024-07-24 at 17.29.51_7ece992f విశ్వంభర, కల్వకుర్తి, జులై 24 : - ఈనెల 28వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం లో పర్యటిస్తున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వెల్దండ మండలం జాతీయ రహదారిపై ఉన్న కొట్ర చౌరస్తాలో మాజీ కేంద్రమంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్, స్వర్గీయ జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ప్రారంభిస్తారని తర్వాత సర్వారెడ్డిపల్లిలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవం చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని, అనంతరం కల్వకుర్తి పట్టణంలోని  మున్సిపాలిటీ  కార్యాలయం దగ్గర నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. ఈ పర్యటనకు సంబంధించిన అధికారులతో తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి పర్యటన ను విజయవంతం చేయాలని తెలిపారు ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, ఆర్ డి ఓ శ్రీను, వివిధ కార్యాలయ ఉన్నత అధికారులు  తహసిల్దార్ లు, ఎంపీడీవో, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2024-07-24 at 17.29.51_75bfe8a1