రాజీవ్ బతికి ఉంటే అయోధ్య రామమందిరం పూర్తయ్యేది: జీవన్‌రెడ్డి

రాజీవ్ బతికి ఉంటే అయోధ్య రామమందిరం పూర్తయ్యేది: జీవన్‌రెడ్డి

కోర్టు తీర్పు ప్రకారమే రామ మందిరాన్ని నిర్మించామని వెల్లడించారు. న్యాయ స్థానం తీర్పును ఎవరైనా గౌరవించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మతసామరస్యానికి కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ బతికి ఉంటే ఎప్పుడో అయోధ్యలో రామమందిరం పూర్తి అయ్యేదని అన్నారు. కోర్టు తీర్పు ప్రకారమే రామ మందిరాన్ని నిర్మించామని వెల్లడించారు. న్యాయ స్థానం తీర్పును ఎవరైనా గౌరవించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మతసామరస్యానికి కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. 

బీజేపీ తీరుతోనే రామమందిరం ఆలస్యమైందని ఆరోపించారు. మోడీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. బుల్డోజర్ కల్చర్ తెచ్చింది బీజేపీ ప్రభుత్వం అని విరుచుకపడ్డారు.  జగిత్యాల ప్రజల తీర్పును గౌరవిస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read More బొల్లారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు

ఆర్టీసీ బస్ లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మోడీ తప్పు పడుతున్నారని గుర్తుచేశారు. దీన్నిబట్టి మహిళల పట్ల మోడీకి ఉన్న వివక్షత అర్ధమౌతుందన్నారు. మోడీ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ద్వంద వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు.. దేశంలో బుల్ డోజర్ కల్చర్‌ను తెచ్చింది బీజేపీ పార్టీ అని అన్నారు. రామ మందిరం అంకురార్పణ 1989లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. వాస్తవాలను కప్పి పుచ్చడానికి మోడీ ప్రయత్నం చేస్తున్నాడని  జీవన్ రెడ్డి మండిపడ్డారు.