రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం

WhatsApp Image 2024-07-26 at 12.09.19_ceb55a63

విశ్వంభర భూపాలపల్లి జూలై 26 : -  తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో  విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసిందని SFI భూపాలపల్లి కమిటీ ఆధ్వర్యంలో లో భూపాలపల్లి అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపారు.  అనంతరం SFI భూపాలపల్లి కార్యదర్శి కుమ్మరి రాజ్ కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.3% కేటాయించిందని అన్నారు. ఇది గత ఓటాన్ బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ కంటే తక్కువ అని గత బడ్జెట్లో విద్యారంగానికి 21,389 కోట్ల రూపాయలు కేటాయిస్తే  ప్రస్తుతం 21,292కోట్లు కేటాయించారని అన్నారు.   ఈ నిధులతో ప్రస్తుతం ప్రభుత్వ విద్య ఏ మాత్రం అభివృద్ధి కాదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినట్లు ప్రతి మండలంలో తెలంగాణ మోడల్ ఇంటర్నేషనల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పినది.కానీ దాని ఊసు ఈ బడ్జెట్లో లేదు. ప్రతి రెండు గ్రామాలకు ఒక గురుకులం అని అన్నారు.దాని గురించి చర్చే లేదు. యూనివర్శిటీల అభివృద్ధి రాష్ట్రంలో 500 కోట్లతో ఎలా సాధ్యం అవుతుంది. వీటిలో ఉస్మానియా, మహిళా యూనివర్సిటీ 200 కోట్లు పోనూ 300 కోట్లు పలహారం పంచినట్లు పంచారు. యూనివర్శీటీల నిర్వహణ మినహా అభివృద్ధికి యూనివర్శిటీలు నోచుకోవు. ప్రజా ప్రభుత్వం ఎలా ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేస్తుందో తెలపాలని  ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 రాష్ట్రంలో గత బిఆర్ఎస్ పాలనలో యూనివర్శీటీలు దెబ్బతిన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెస్,భవనాలు, ఖాళీల భర్తీ, మౌళిక సదుపాయాలు కల్పిస్తామని ప్రతి యూనివర్శీటీకి అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పారు. ఉస్మానియా కు 1000కోట్లు,మహిళ యూనివర్శీటీఅభివృద్ధి కోసం. 500 కోట్లు  నిధులు నిర్వహణ, బాసర ఐఐఐటి అభివృద్ధి, అలాగే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాలలో నూతన యూనివర్శీటీలు కోసం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ యూనివర్శీటీలు అభివృద్ధి కోసం 500కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. రాష్ట్రంలో ఉన్న 11 రాష్ట్ర యూనివర్శీటీలకు కనీసం నిర్వహణకు కూడా నిధులురావు. ఒక్క ఉస్మానియా యూనిర్శీటీకే 350 కోట్లు పైగా నిర్వహణకు అవసరం. కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన, జెఎన్టీయుహెచ్, ఫైన్ ఆర్ట్స్, మహిళా యూనివర్శీటీ, అగ్రికల్చర్ యూనివర్శీటీ,వెటర్నరీ, హర్టీకల్చర్ లాంటి వాటికి నిధులు కేటాయింపులు లేవు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రకారం బాసర ఐఐఐటిల లాగా మరో రెండు కేటాయిస్తామని చెప్పి వాటి గురించి కూడా ప్రస్థావన లేదు అని ఎద్దేవా చేశారు. తక్షణమే బడ్జెట్ సవరించి విద్యారంగానికి
నిధులను పెంచి ప్రభుత్వ విద్యారంగాన్నీ అభివృద్ధి చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నరేష్, జిల్లా కమిటీ సభ్యులు స్వామి ,ప్రభుత్వ జూనియర్ కళాశాల కమిటీ సభ్యులు చరణ్, రఘు, చందు తదితరులు పాల్గొన్నారు.

Read More  ప్రముఖ సినీ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత