బండి సంజయ్ అసమర్థుడు అన్నవ్ గదా అంతలోనే అసాద్యుడు ఎలా అయ్యిండో?

మేయర్ సునీల్ రావు వాఖ్యలను ఖండించిన సుడా చైర్మన్

WhatsApp Image 2024-07-16 at 19.21.00_864d40f6

విశ్వంబర కరీంనగర్ జూలై 16 :- మొన్నటి వరకు ఎంపిగా బండి సంజయ్ కుమార్ విఫమలయ్యాడనీ అసమర్థుడనీ కరీంనగర్ పట్టణ అభివృద్ధికి ఒక్క పైసా నిధులు తీసుకురాలేదని అభివృద్ధి పై అసలు అవగాహనే లేదని మాట్లాడిన మేయర్ సునీల్ రావు ఇప్పుడు పట్టణ అభివృద్ధికి బండి సంజయ్ కుమార్ వందల కోట్ల నిధులు తీసుకు వచ్చిండనీ మాట్లాడిన తీరుకు ఊసరవెల్లులే సిగ్గుపడే పరిస్థితి వచ్చిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నరేందర్ రెడ్డి మేయర్ సునీల్ రావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై గతంలో మాట్లాడిన  వీడియోను ఇప్పుడు మాట్లాడిన వీడియోను చూపించారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలలో విలువలు పాటించాలని పట్టణ ప్రథమ పౌరుడిగా ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలని రాజకీయాల పేరుతో ఎన్ని అబద్దాలైన ఆడవచ్చనేది కరెక్ట్ కాదని అన్నారు.కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని అందులో ఎటువంటి అనుమానం సునీల్ రావుకు అవసరం లేదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ విలేఖరుల సమావేశంలో నాయకులు దన్న సింగ్,అబ్దుల్ రహేమాన్,షబానా మహమ్మద్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,దాసరి నర్సింహ రెడ్డి,పెద్దిగారి తిరుపతి, మహమ్మద్ భారీ,కీర్తి కుమార్,కిరణ్ రెడ్డి, అష్రఫ్,ఖలీల్,నరేష్,జమీల్,హనీఫ్ తది తరులు పాల్గొన్నారు

Read More అద్దంకి నార్కట్ పల్లి  హైవేపై నందిపాడులో  బస్ బోల్తా - పలువురికి తీవ్ర గాయాలు