తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన

తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన

 

దేశంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణతో పాటు 12 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. 

Read More స్మార్ట్ ఫోన్లు - సైబర్ నేరాలు

తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతాయని తెలిపింది. ఈ రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, పంజాబ్, హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్‌లలో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది.