చింతపల్లిలో ఘనంగా గణపతి ఉత్సవాలు - శ్రీ రాజ రాజేశ్వర దేవాలయంలో గణనాథుని విగ్రహ ప్రతిష్ట
On
విశ్వంభర, చింతపల్లి :దేవతా మూర్తిలందరిలో మొదటి పూజలు అందుకొనే విఘ్నాలు తొలగించే లంబోదరుడి పండుగకు సర్వం సిద్ధం చేసుకొని ప్రతి ఏటా భాద్రపద మాసంలో వినాయక చవితి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూంది. అందులో భాగంగా శనివారం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ రాజ రాజేశ్వర దేవాలయ ప్రాంగణంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుని నవరాత్రులు పురస్కారించుకొని 30 మంది కార్యకర్తలు, యువకులు వినాయక దీక్షను చేపట్టారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవిందు రవికుమార్, గోవిందు ప్రసాద్, సోమరాజు ప్రదీప్, కుందేళ్ళ చెన్నయ్య, సోమరాజు సాయి, నర్సింహా, కడారి క్రిష్ణ, యాచారం ఆంజనేయులు, ప్రవీణ్, సతీష్, వినోద్, తదితరులు పాల్గొన్నారు