శ్రీరామ్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
On
విశ్వంభర, ఎల్బీనగర్ : కొత్తపేటలోని శ్రీరామ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ దాచేపల్లి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణలో ఆడపడుచులు బతుకమ్మ పండుగ ను ఎంతో వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. నేటితరం విద్యార్థులకు సాంప్రదాయాలను తెలియజేసే విధంగా కళాశాలలో ప్రతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ విద్యార్థులు అందరూ కలిసి ఎంతో ఆనందంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్యామల, సిబ్బంది నాగమణి, నాగ లత, రామసుధ, రామ శేషు, శ్రీదేవి, లలిత శ్వేత నవనీత రామేశ్వర్ రెడ్డి రవీంద్రం నాగేశ్వరరావు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.