రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకి రూ. 7500

రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకి రూ. 7500

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రైతులకు గుడ్ న్యూస్ చెబుతోంది. ఇప్పటికే పంట బీమాపై ప్రీమియం ప్రభుత్వమే కడుతుందని మంత్రి సీతక్క ప్రకటించారు. రుణమాఫీకి కూడా ప్రభుత్వం సన్నహకాలు ప్రకటించింది. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి కటాఫ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. రుణమాఫీకి 30 వేల కోట్లు అవసరమని అంచనా వేసిన ప్రభుత్వం నిధుల సేకరణకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. 

 

Read More  రోశయ్య వర్ధంతి సభకు తరలిరావాలి - మీడియా కమిటీ ఛైర్మన్ కౌటిక విఠల్

ఇదిలా ఉండగా.. రైతు భరోసాకు కూడా సన్నాహకాలు ప్రారంభించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత వారం ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. అలాగే వానాకాలంలో సాగయ్యే పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రభుత్వం రైతు భరోసా కింద ఇస్తానన్న పెట్టుబడి సాయాన్ని ఈ వానాకాలం సీజన్ నుంచే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. 

 

Read More  రోశయ్య వర్ధంతి సభకు తరలిరావాలి - మీడియా కమిటీ ఛైర్మన్ కౌటిక విఠల్

జులై నెలలో ఎకరానికి రూ. 7500 చొప్పున పెట్టుబడి సాయం కింద రైతులకు అందిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. అంటే సాగు మొదలైయ్యే నాటికే రైతులు అకౌంట్లలో నిధులు జమ అయ్యేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. అలాగే రైతుల నుండి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలుదార్లకు భరోసా సహాయం అందుతుందని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలే కాకుండా.. ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తామని తుమ్మల ప్రకటించారు.