నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలివ్వండి.. హరీశ్‌రావు ట్వీట్..!
రాష్ట్రంలోని నర్సింగ్ ఆఫీసర్లకు వెంటనే జీతాలివ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మంగళవారం ఎక్స్ వేదికగా కోరారు.
రాష్ట్రంలోని నర్సింగ్ ఆఫీసర్లకు వెంటనే జీతాలివ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మంగళవారం ఎక్స్ వేదికగా కోరారు. రాష్ట్రంలో 7వేల మంది నర్సింగ్ ఆఫీసర్లు నాలుగు నెలలుగా జీతాల్లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 7వేల నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుందని విమర్శించారు.
అయితే, వారికి ఇంతవరకు జీతాలు ఇవ్వకుండా వారిని పట్టించుకోవడంలేదని ఆరోపించారు. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారు. సమయానికి జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, నర్సింగ్ ఆఫీసర్లకు నాలుగు నెలల నుంచి జీతం ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప, వారి జీతభత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదంటూ దుయ్యబట్టారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ వెంటనే 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు ఇవ్వాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదు.
— Harish Rao Thanneeru (@BRSHarish) May 21, 2024
ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప, వారి జీత భత్యాల గురించి…