టిఅర్ఎస్ పార్టి కండువా వేసుకున్న మాజి మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హారీష్ రావు
On
ఇవాళ పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్న హారీష్ రావు బిఅర్ఎస్ పార్టి కండువా కాకుండా టిఆర్ఎస్ పార్టీ కండువా మెడలో వేసుకున్నారు...దీనితో బిఅర్ఎస్ పార్టి కాస్త మళ్లీ టిఅర్ఎస్ పార్టీగా మారబోతుందా అనే చర్చ జరుగుతుంది..ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కూడా మాజి ఎంపి వినోద్ కుమార్ కూడా టిఅర్ఎస్ పార్టీని తీసేసి బిఅర్ఎస్ పార్టీగా వెళ్లటం వల్లే మాకు ప్రజలు దూరమయ్యారని, అందుకే,అసెంబ్లీ ,పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పారు...ఈ విషయంపై పార్టి అధినేత కేసిఅర్ తో చర్చిస్తానని చెప్పారు...ఇక పార్టి శ్రేణుల్లో కూడ టిఅర్ఎస్ పార్టి ఉంటేనే బాగుంటుందనే చర్చ కూడా జరుగుతుంది