పాడి రైతుల ధర్నా,రాస్తారోకో

WhatsApp Image 2024-07-25 at 14.04.35_056f6a41

విశ్వంభర, కల్వకుర్తి, జూలై 25 : -కల్వకుర్తి పట్టణ కేంద్రంలో రెండు నెలలుగా పాల బిల్లులు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పాడి రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేసి ధర్నాకు దిగారు 
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మిల్క్ సెంటర్ ఎదురుగా ప్రధాన రహదారిపై చాలా గ్రామాల పాడి రైతులు పాలక్యాన్లతో నిరసన రాస్తారోకో చేస్తూ ధర్నాకు దిగారు, రెండు నెలలుగా నాలుగు బిల్లులు రావడంలేదని ఎన్నిసార్లు అడిగినా కాలయాపన తప్ప పరిష్కార మార్గం దొరకక రోడ్ ఎక్కామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులు సకాలంలో ఇవ్వాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని రైతులు హెచ్చరించారుWhatsApp Image 2024-07-25 at 14.04.35_179704ea

Read More మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన సదస్సు