గట్టుప్పల్ లో ముదురుతున్న వివాదం - శిలాఫలకంపై రగడ

గట్టుప్పల్ లో ముదురుతున్న వివాదం -  శిలాఫలకంపై రగడ

 మాజీ మహిళా సర్పంచ్ ఇడెం రోజాకు అగౌరవం - ఆగ్రహం వ్యక్తం చేసిన ఇడెం కైలాసం

పద్మశాలి కుల సంఘామా  - రాజకీయ వేదికనా..

.అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన - గట్టుప్పల మండల సాధన సమితి అధ్యక్షుడు ఇడెం కైలాసం

విశ్వంభర , చండూర్ / గట్టుప్పల్ : మహిళా ప్రజాప్రతినిధిని అగౌరవపరచారంటూ గట్టుప్పల మండల సాధన సమితి అధ్యక్షుడు ఇడెం కైలాసం గట్టుప్పల పద్మశాలి సంఘం పై మండి పడ్డారు. పద్మశాలిల ఆరాధ్యం , భారత స్వాతంత్ర ఉద్యమంలో , తెలంగాణ తోలి దశ ఉద్యమంలో పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటు లో మాజీ సర్పంచ్ ఇడెం రోజా పేరును శిలా ఫలకంలో  పెట్టకపోవడం పై సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది. సెప్టెంబర్ 27 వ తేదీ శుక్రవారం నాడు విగ్రహావిష్కరణ సందర్బంగా పద్మశాలి కుల, రాజకీయ , చేనేత నాయకులను గౌరవించుకునే ప్రయత్నంలో పద్మశాలి సంఘం పక్షపాత ధోరణిని అవలంభిస్తుందని మండి పడ్డారు. 

పద్మశాలిలను ఒక్కటి చేయాలి రాజ్యాధికారం సాధించాలని ఒకవైపు ఉపన్యాసాలు ఇస్తూనే ఇండిపెండెంట్ గా మేజర్ గ్రామ సర్పంచ్ గెలిచిన యువ మహిళా సర్పంచ్ ను తెలంగాణ వ్యాప్తంగా గుర్తిస్తే, రాజకీయ కక్ష్య తో ఆ గ్రామ పద్మశాలి సంఘం మాత్రం అగౌరవ పరచడం, గత మూడు సంవత్సరాలుగా బాపూజీ విగ్రహాన్ని మండల కేంద్రం లో ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిదులు,  గ్రామ ప్రజలు కోరుకున్నారు. కానీ రాజకీయాలు నడిపిస్తూ వాయిదా వేస్తూ వచ్చారు. 

Read More  బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు 

గత సంవత్సరమే విగ్రహం పెట్టినప్పటికీ ఆనాటి సర్పంచ్ పేరు ప్రోటోకాల్ ప్రకారం శిలా ఫలకం లో రాయాల్సి వస్తుందని సర్పంచ్ పదవి కాలం ముగిసే వరకు పనులు మొదలు పెట్టలేదని , కానీ పదవి కాలం ముగిసిన వెంటనే చక చక  పనులు మొదలు పెట్టి తమ పేర్లు మాత్రమే వుండాలని కొందరు నాయకులు ప్రయత్నం చేసుకుంటూ వచ్చారని అన్నారు. 

ఎవ్వరు  సపోర్ట్ చేయక పోయిన సర్పంచ్ గా గెలిచిందని ,  ఎలాగైనా అవమానించి రాక్షస ఆనందం పొందాలని కుట్ర చేసి,
తాజా మాజీలైన జెడ్ పి టి సి, ఎంపిపి ,ఎంపీటీసీ ల పేర్లను ఆత్మీయ అతిధులుగా శిలా ఫలకం పై వ్రాసి తాజా మాజీ యువ మహిళా సర్పంచ్ పేరు మాత్రం వేయకపోవడం దారుణమని అన్నారు. 

 గ్రామం లోని రాజకీయాలు మొదటి నుండి ఇదే విధంగా ఉన్నాయని, వారు వారి చెప్పు చేతలలో వుండే వారు మాత్రమే రాజకీయాలు చేయాలని , లేనిచో ప్రజలతో మమేకం అయ్యి వుండే నాయకులను,  కొంతమంది  కలిసి ఇబ్బందులకు అవమానాలకు గురిచేస్తారని తెలిపారు.

గతంలో గట్టు ప్పల మండల కోసం ఉద్యమిస్తున్న సందర్భములో ఉద్యమం లో పాల్గొన్న వారిని భయబ్రాంతులకు గురి చేసిన విషయాన్ని గుర్తు చేసారు. సర్పంచ్ గా  ఇడెం రోజా చేసిన సేవలను  తెలంగాణ అంతా గుర్తించిన కూడా  సొంత సామాజిక వర్గంలో  కొందరు నాయకులు అసహనానికి గురై కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

Tags: