కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, రైతుల పార్టీ - మునుగోడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి 

కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, రైతుల పార్టీ - మునుగోడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి 

రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

నిర్వాసితులు నష్టపోకుండా సమస్య ను పరిష్కరించాలని యాదాద్రి కలెక్టర్ కి ఫోన్

రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులతో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి 

విశ్వంభర, హైద్రాబాద్ :  రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో  భూములు కోల్పోతున్న  చౌటుప్పల్ మండలంలోని  చౌటుప్పల్, లింగారెడ్డిగూడెం, కుంట్ల గూడెం, మందోళ్లగూడెం నేలపట్ల గ్రామాల భూ నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని మనుగోడు శాసనసభ్యులు  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని   హైదరాబాదులోని తన నివాసంలో కలిసారు. రీజినల్ రింగ్ రోడ్డు  కింద భూములు కోల్పోతున్నామని అక్కడ ఉన్న మార్కెట్ రేటు కంటే  ప్రభుత్వం ఇచ్చే పరిహారము చాలా తక్కువగా ఉంటుందని శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కి ఫోన్ చేసి భూములు కోల్పోతున్న నిర్వాసితుల వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసి ప్రభుత్వానికి పంపించాలని కోరారు. వీలైనంతగా రైతులకు న్యాయం చేయడానికే పాటుపడాలన్నారు. మార్కెట్ రేటు  చాలా ఎక్కువగా ఉందని ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మూలకు సరిపోదని  ఎలాగైనా తమకు న్యాయం చేయాలని రీజినల్ రింగ్ రోడ్డు లో  భూములు కోల్పోతున్న రైతులు ఎమ్మెల్యే ని  కోరారు... నేను రైతు పక్షపాతినని  రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి వెనకాడనని చెబుతూనే సాధ్యమైనంతగా ప్రభుత్వంతో చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని  హామీ ఇచ్చారు.

Tags: