కాంగ్రెస్ సర్కార్ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలి: కేటీఆర్

కాంగ్రెస్ సర్కార్ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలి: కేటీఆర్

హైదరాబాద్ నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో 2016లో తాను శంకుస్థాపన చేసిన మల్టీలెవల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

హైదరాబాద్ వాసులను నిత్యం వేధిస్తున్న వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తలపెట్టిన  మల్టీలెవల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. హైదరాబాద్ నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో 2016/17లో  ఆలోచన చేసినట్లు గుర్తుచేశారు. తాను  పీపీపీ విధానంలో పైలట్ ఎంఎల్‌సీపీ (మల్టీలెవల్ కార్ పార్కింగ్) ప్రాజెక్ట్‌ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైందని పేర్కొన్నారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు చక్కగా రూపుదిద్దుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.

తాము అనుకున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన జంక్షన్లు, మెట్రో స్టేషన్లు, వాణిజ్య కేంద్రాలలో మరిన్నింటిని జోడిస్తుందని ఆశిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, అరెకరం స్థలంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు వివిధ కారణాలతో ముందుకు వెళ్లడంలేదు. సుమారు రూ.80 కోట్ల భారీ అంచనా వ్యయంతో దాదాపు 1,44,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా దీన్ని నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఇది జర్మన్ పాలిస్ పార్కింగ్ సిస్టమ్‌లో భారతదేశంలోనే మొట్టమొదటి కావడం విశేషం.

Read More సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం గుమ్మడవెళ్ళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల