రుణమాఫీపై కసరత్తు.. 15 లేదా 18న కేబినెట్ భేటీ..?

రుణమాఫీపై కసరత్తు.. 15 లేదా 18న కేబినెట్ భేటీ..?

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రుణమాఫీపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విధి విధానాలపై అధికారులు అన్ని పనులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 9నే చేస్తామన్న రుణమాఫీ కాస్తా ఆగస్టు 15 కు మారింది. ఇక ఇచ్చిన హామీ సమయం గడువు దగ్గర పడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ మీద దృష్టి సారించారు.

Read More మహిళా విభాగ్ అధ్యక్షరాలికి బుక్కా ఈశ్వరయ్య అభినందనలు 

ఈ మేరకు ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల అకౌంట్లకే డబ్బులు వేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తులు స్టార్ట్ చేశారు. ఈ నెల 15 లేదా 18న రుణమాఫీ అంశం మీద కేబినెట్ భేటీ నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. 

ఏ తేదీని కటాఫ్ గా పరిగణించాలి, శాఖల సమన్వయంతో పాటు రుణమాఫీ అర్హులను ఎలా గుర్తించాలి, నిధుల సమీకరణపై రేవంత్ రెడ్డి సమీక్షించబోతున్నారు. డిసెంబర్ నెలలోని ఏదో ఒక తేదీని కటాఫ్ గా పరిగణించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎలా రుణమాఫీ చేశారనే దానిపై అధికారులు అధ్యయనాలు చేస్తున్నారు. మహారాష్ట్రలో నేరుగా రైతుల అకౌంట్లలోకి ఎలా డబ్బులు జమ చేశారనే దానిపై కసరత్తులు మొదలు పెట్టారు.