నల్గొండ పై విషం చిమ్ముతున్న బీఆర్ఎస్ - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ పై విషం చిమ్ముతున్న బీఆర్ఎస్ - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

•    కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నల్గొండ ప్రజలంటే ఎందుకు అంత కోపం..?
•    మానవత్వం మరిచిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు
•    మూసీ కాలకూట విషంపై అపోహలుంటే మీ మాజీ ఓఎస్డీ ని అడిగి తెలుసుకోండి.
•    మాది బుల్డొజర్ పాలన కాదు.. ప్రజాపాలన
•    మూసీ సుందరీకరణతో పాటు శుద్ధీకరణ చేస్తున్నాం.
•    నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజలు నరకయాతన పడుతుంటే రాక్షసానందం పొందుతున్న కేసిఆర్ ఫ్యామిలి.
•    నల్గొండ జిల్లా పోరాటాల గడ్డ..
•    రాజాకార్లు, సీమాంధ్రులతో పోరాడినట్టే మూసీ వ్యతిరేకులతో పోరాడాల్సి వస్తది
•    మూసీ పై నాది దశాబ్ధాల పోరాటం.. నల్గొండ పట్ల అంత అమానవీయత ఎందుకు.. ?
•    ఈసారి అసెంబ్లీకి కేసిఆర్ వస్తే నల్గొండ సమస్యలపై నిలదీస్తాం
•    మూసీ ప్రక్షాళన పేరుతో కార్పేరోషన్ ఏర్పాటు చేసి.. కాంగ్రెస్ శాసన సభ్యున్ని ఛైర్మన్ చేసిన కేసిఆర్ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..
•    మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

విశ్వంభర, హైద్రాబాద్ :     మూసీ సుందరీకరణ మాత్రమే కాదు కోట్లమంది బ్రతుకులను కాలుష్యం నుంచి కాపాడే శుద్ధీకరణ.

•    నేను ఇప్పుడు కాదు రెండు దశాబ్ధాలుగా ఫ్లోరైడ్, మూసీ శుద్ధీకరణ మీద పోరాటం చేస్తున్నాను.

Read More యువ విద్యార్థుల్లో వ్యవస్థాపక ప్రోత్సాహమే బీవీఆర్ సైంట్ లక్ష్యం:బీవీఆర్ సైంట్ సీఈవో డా. సుధాకర్ పొటుకుచ్చి 

•    ప్రధానితో పాటు కేంద్రంలో ఎందరో మంత్రులను కలిసి మూసీ శుద్ధీకరణకు నిధులు కేటాయించాలని వినతులు ఇచ్చా.

•    నేను తిరగని ఇళ్లు లేదు, నేను కేంద్రంలో కలవని నాయకుడు లేడు.

•    వాళ్లు మూసీ బాధితులను తెలంగాణ భవన్ కు పిలిపించుకొని జనతాగ్యారేజీ అని సోషల్ మీడియాలో తిప్పుకుంటున్నరు..

•    మీదీ జనతా గ్యారేజ్ కాదు.. జనాన్ని ముంచే గ్యారేజీ, జనాల్ని వంచించే గ్యారేజీ.. అందుకే మీ కారు గ్యారేజీకి పరిమితమైంది.

•    నల్గొండ ఫ్లోరైడ్ కష్టం చెప్పుకుంటే తీరేది కాదు.. ఇక్కడ భూగర్భ జలాలను కాకుండా భూఉపరితలంపై ప్రవహించే జలాలను మాత్రమే శుద్ధి చేసి వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర జలశక్తి సంస్థ చెప్పింది. కానీ గత ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. ఇది అత్యంత బాధాకరం.
•    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని ఉద్యమం చేసి తెలంగాణను తెచ్చుకుంటే.. ఈ పదేండ్లలోనూ నల్గొండకు తీరని అన్యాయం జరిగింది.
 
•    మిషన్ భగీరథ పేరుతో గత ప్రభుత్వం చేసిన ప్రజాధనం వృధాను కేంద్ర జలశక్తి నివేదిక ఇటీవల తేటతెల్లం చేసింది. నల్గొండ భూగర్భంలో ఇంకా ఫ్లోరైడ్ జడలు విప్పుకొని కూర్చుందని తేల్చింది.

•    ఈ మధ్యనే వచ్చిన నదులనీటి నాణ్యతా ఇండెక్స్ లో మూసీ రివర్ నీటిలో ఆక్సీజన్ స్థాయిలను ప్రభావితం చేసే టర్బిడిటీ స్థాయిలు 1-4 మధ్యన ఉండాలి కానీ ఇది దామరచర్ల దగ్గర 15 గా ఉంది, వలిగొండ దగ్గర 13గా ఉంది, వాడపల్లి దగ్గర 13గా ఉంది. 

•    బీఓడి (బయోలాజికల్ ఆక్సీజన్ డిమాండ్) స్థాయిలు 3 మిల్లీ గ్రాముల కంటే తక్కువ ఉండాలి.. కానీ వలిగొండ దగ్గర 10.01 శాతం ఉంది.

•    డయేరియా, జ్వరం, చర్మవ్యాధులకు కారణమయ్యే భయంకరమైన కొలిఫాం బ్యాక్టీరియా తాగునీటి లో అసలే ఉండకూడదు. కానీ.. 
మన 
* దామరచర్లలో 1400 గా ఉంది..
* వలిగొండ ప్రాంతంలో 2200 గా ఉంది.
*వాడపల్లి దగ్గర 1500 గా ఉంది. 
•    ఇంత దారుణమైన బ్రతుకులు మనకు ఎందుకు రావాలే.. అందుకే తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు పూనుకున్నది.

•    మూసీ పరివాహక ప్రాంత పరిధిలో వివిధ కంపెనీలు రసాయన వ్యర్ధాలను మూసీలోకి వదిలిపెడుతుండటంతో నది అంతా కాలుష్యంగా మారి నల్గొండ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది.

•    వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు నదులను శుభ్రం చేసుకొని ప్రజలను వ్యాధులనుంచి దూరం చేసుకుంటుంటే మన దగ్గర ప్రతిపక్షాలు మాత్రం మూసీ ప్రక్షాళన ఎందుకని గగ్గోలు పెడుతున్నాయి.

•    అయినప్పటికి మన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుములు రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లా ప్రజల జీవితాలను నరకప్రాయంగా మార్చిన మూసీ కాలుష్యాన్ని శుద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు.

•    మూసీ విష రసాయనాలతో ఇప్పటికే అన్నీ కోల్పోయాం
•    ఇక్కడ పండే పంటలు,కాయగూరల్ని ఎవరు కొనలేని పరిస్థితి.
•    మూసీ తీర ప్రజలంతా మంచినీళ్లు కొనుక్కొని తాగుతున్నాము..శుద్ధి చేయకపోతే మనుషులూ మిగలరు
•    మూసీ శుద్ధిలో నిరాశ్రయులయ్యే వారికి అన్ని విధాలుగా ప్రభుత్వ అండగా ఉంటుంది.
•    మూసీ శుద్దిపేరు చెప్పి వెయ్యి కోట్లు మింగిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు నీతులు చెబుతోంది
•    శుద్ధీకరణ అడ్డుకోవటమంటే.. రైతులు, నిరుపేదలకు మరణశాసనం రాయటమే
•    కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులో మూసీనది ఒడ్డున నెల రోజుల పాటు నివాసం ఉంటే..తెలుస్తుంది..ఆ బాధ ఎంటో..
•    కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు. ఇళ్లకు మూసీ తీర ప్రాంత శాపగ్రస్తులను తీసుకువస్తాం.
•    మూసీ కాలకూట విషం మీద వాస్తవాలు కావాలనుకుంటే.. సీఎం కేసీఆర్‌కు ఓఎస్డీగా పనిచేసిన ప్రియాంక వర్గీస్‌ను అడిగి తెలుసుకోండి. ఆమె ఇటీవలే మూసీపై పీహెచ్‌డీ చేసింది.
•    మూసీ అంటే.. ఒక్కప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు జీవనాఢి. 
•    కానీ ఇప్పుడు మూసీ అంటే ఓ విషం.
•    మూసీ అంటేనే మురికి కూపం
•    మూసీ శుద్ధి పేరుతో వెయ్యి కోట్లు దుర్వినియోగం చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పుడు మూసీనది శుద్ధీకరణలో రాజకీయం చేస్తుండటం అత్యంతదారుణం. 
•    మూసీ కాలకూట విషం మీద వాస్తవాలు కావాలనుకుంటే.. సీఎం కేసీఆర్‌కు ఓఎస్డీగా పనిచేసిన ప్రియాంక వర్గీస్‌ను అడిగి తెలుసుకోండి. ఆమె ఇటీవలే మూసీపై పీహెచ్‌డీ చేసింది.
•    కాటేదాన్, పటాన్‌చెరు,జీడిమెట్ల, కూకట్‌పల్లి, సనత్‌నగర్, ఆజామాబాద్,ఉప్పల్,మల్లాపూర్, నాచారం ఇండ్రస్ట్రియల్‌ ఏరియాల నుండి విష రసాయనాలు నేరుగా మూసీలో వదలేయటం అతి ప్రధాన సమస్య. 
•    హెచ్‌ఎండీఏ పరిధిలోని  ఇళ్ల నుండి వచ్చే డ్రైనేజీ నీళ్లు, వ్యర్థ పథార్థాలన్నీ  ఇప్పుడు మూసీలోనే కలుస్తున్నాయి. ఈ విషపు నీళ్లని ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా కృష్ణాలో కలుస్తూ..అందరికీ విషాన్ని పంచుతున్నాము.

•    మీ పదేళ్ల పాలన నిర్వాకం వల్ల  హైదరాబాద్‌లో నిత్యం 2000 ఎంఎల్‌డీల వరకు మురుగు, రసాయనాలతో కూడిన వ్యర్థజలాలు మూసీలో కలుస్తుంది.
•    మీ పదేళ్ల పాలన నిర్వాకం వల్ల  హైదరాబాద్‌లో నిత్యం 2000 ఎంఎల్‌డీల వరకు మురుగు, రసాయనాలతో కూడిన వ్యర్థజలాలు మూసీలో కలుస్తుంది.
•    ఇందులో కేవలం 800 ఎంఎల్‌డీల నీటినే ఎస్‌టీపీల ద్వారా శుద్ది చేస్తున్నారు.  మిగతాది శుద్ది లేకుండానే మూసీకి వదులుతున్నారు. 
•    రసాయనాలను శుద్ది చేసే ఈటీపీలు లేకపోవటంతో పారిశ్రామిక రసాయనాలన్నీ మూసీలోకి ఆపై పంట పొలాలు, ఆపై పశువులు, కాయగూరల్లో వచ్చి చేరి మనుషుల శరీరాల్లోకి వస్తున్నాయి. 
•    హుస్సేన్‌సాగర్‌ నీళ్లను పాల లెక్క మారుస్తామని మూసీ శుద్ధి పేరుతో రూ.1000 కోట్లు దోచుకున్న మీరు, కాంగ్రెస్‌లో గెలిచిన ఎంఎల్‌ఏకు మూసీ ఛైర్మన్‌ పదవి ఆశచూపి దగుల్బాజీ రాజకీయం చేయలేదా..అని అడుగుతున్నా..
•    మూసీనదిలో కేన్సర్‌ కారక ఆర్సెనిక్, క్రోమియం,కాపర్, నికెల్,లెడ్‌ తదితర రసాయనాలను ఎన్‌జీఆర్‌ఐ తన పరిశీలనలో గుర్తించింది. 
•    ఈ నీటితో పండించే పంటలతో బారలోహాలున్నట్లు తేల్చారు. ఇవి తింటే కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ భూములు పంటలకు పనికి పరిస్థితి. చెరువుల్లో చేపలు,గడ్డిమేసే పశువులు, నీళ్లు తాగే పక్షులు సైతం పునరుత్పత్తిని కోల్పోయినట్లు పరిశోధనలు తేల్చాయి. 
•    మూసీ నీటితో పండే పంటల్లో భారలోహాలు(హెవీ మెటల్స్‌) కారణంగా తింటే..తీవ్ర ఆనారోగ్యం పాలవుతున్నారు. కావాలనుకుంటే మాజీ సీఎం కేసీఆర్‌కు ఓఎస్డీగా పనిచేసిన ప్రియంకా వర్గీస్‌ను అడిగి తెలుసుకోండి. 
•    ఇటీవలే ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుండి మూసీ నదిపై పీహెచ్‌డీ చేసింది. మూసీపై అనేక పరిశోధనలు చేసిన ఓయూ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లును కలిసి తెలుసుకుంటే మంచిది.
•    కాంగ్రెస్‌ పార్టీ విధానమే.. బుల్‌డోజర్‌కు వ్యతిరేకం. పేదలకు అనుకూలం. 
•    కేసిఆర్, కేటీఆర్,హరీష్‌రావులు.. మూసీ పీడత ఊళ్లకు రండి
•    మూసీ నది కలుషితం కాని ప్రాంతాల్లోని పరిధిలో ఫాంహౌజ్‌లు కట్టుకున్న కేటీఆర్,హరీష్‌రావు, హైదరాబాద్‌కు 100 కి.మీ దూరంలోని ఎర్రవెళ్లిలో సువిశాల ఫాంహౌజ్‌ కట్టుకున్న కేసీఆర్‌లు వచ్చి ఒక్క నెల రోజులు మూసీ తీరాన ఉండిపోవాలని కోరుకుంటున్న..
•    మూసీ ప్రక్షాళన కు కమిటీ వేస్తాం. అందులో బీఆర్ఎస్ నేతలకు కూడా చోటు కల్పిస్తం.
•    70 వేల పుస్తకాలు చదివిన కేసిఆర్ కు మూసీ గురించి తెలియకపోవడం బాధాకరం
•    ఎస్టీపీలు కట్టినమని ప్రచారం చేస్తున్నరు.. కేవలం ప్రతిపాదనలు మాత్రమే తయారు చేసి కాలక్షేపం చేశారు.
•    కేటీఆర్ అమెరికాలో విద్యాభ్యాసం చేసినా.. మూసి కాలుష్యం గురించి కొంత తెలుసుకుం…

 

Tags: