ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు

వేడుకల్లో పాల్గొన్న  మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 

WhatsApp Image 2024-07-24 at 13.20.18_240c71fa

 విశ్వంభర న్యూస్ నార్కెట్ పల్లి జులై 24 : - ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గారి జన్మదిన సందర్బంగా  నార్కట్ పల్లి మండల కేంద్రంలో జరిగిన జన్మదిన వేడుకలకు *నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య  ముఖ్య అతిధిగా హాజరై కేక్ కటింగ్ చేసి కెటిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసి ఘనంగా సంబురాలు నిర్వహించారు.
    
ఈ సందర్భంగా  మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. అధికారం ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేయడంలో కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారన్నారు. ఆపద వచ్చిందని ఒక్క ట్వీట్ చేస్తే అర్థరాత్రి కూడా స్పందించే మానవతావాది కేటీఆర్ అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా సేవ చేయడంలో కేటీఆర్‌ది అందెవేసిన చెయ్యి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మండలానికి వందల కోట్ల నిధులు కేటాయించారని, కేటీఆర్ సారధ్యంలో నకిరేకల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.కార్యక్రమం లో మండల బీ ఆర్ ఎస్ అధ్యక్షులు బైరెడ్డి కర్ణాకర్ రెడ్డి పట్టణ శాఖ అధ్యక్షులు దోసపాటి విష్ణు మూర్తి, నాయకులు మేకల రాజి రెడ్డి, అశోక్ రెడ్డి వివిధ గ్రామాలనుండి వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read More అంతిరింతుర కొండపై సామూహిక వ్రతాలు