వర్షాకాలం.. జాగ్రత్త..!
8వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్
వార్డుల్లో సమస్యలు తెలుసుకుంటున్న చైర్మన్
విశ్వంభర న్యూస్ : - షాద్ నగర్ మున్సిపాలిటీలోని 8వ వార్డులో శనివారం ఉదయం మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ పర్యటించారు.ఈ సందర్బంగా వార్డులో తిరుగుతు కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపై, లోతట్టు ప్రాంతాలు,డ్రైనేజి కాలువను మరియు అపరిశుభ్రమైన ప్రాంతాలను పారిశుధ్య సిబ్బందితో శుభ్రం చేయించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు సంభవించే అవకాశం ఉందని, ప్రజలందరూ వ్యక్తిగత పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.వార్డులలో పారిశుధ్య సమస్యల పరిష్కారానికి పారిశుధ్య సిబ్బంది, అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సుదీర్, ఎన్విరాంన్మెంట్ ఇంజనీర్ సాయిబాబా,జావీద్ తదితరులు పాల్గొన్నారు.