విద్యార్థులకు మెరుగైన విద్య భోధన చేయాలి

పి.హెచ్.సి. లలో వైద్యులు అందుబాటులో ఉండాలి 
 
ధరణి పెండింగ్ ధరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి 

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.

WhatsApp Image 2024-07-23 at 17.54.02_a5c13b6b

విశ్వంభర చివ్వేంల :- విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనతోపాటు నాణ్యమైన ఆహారం అందించాలని  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  ఆదేశించారు.   మంగళవారం  చివ్వేంల,మోతే మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ చివ్వేంల మండలంలోని  zphs పాఠశాలను తనిఖీ  చేసి కలెక్టర్ విద్యార్థుల హాజరు రిజిస్టర్ ని, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని, ఎ సబ్జెక్ట్ లో విద్యార్థులు వెనుకంజలో ఉంటారో ఉపాధ్యాయులు గుర్తించి వారిపై ప్రత్యేక చొరవ తీసుకొని పరీక్షల నాటికి అధిక మార్కులు వచ్చేలాగా కృషి చేయాలని ఉపాధ్యాయులకి సూచించారు .విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే తమకి తెలియజేయాలని కలెక్టర్ విద్యార్థులతో అన్నారు.
 
 
 
మోతే పి హెచ్ సి ని తనిఖీ చేసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని,సిబ్బంది అందరు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు .తదుపరి మెడికల్ రికార్డ్, ఓ పి రిజిస్టర్ పరిశీలించారు.పి హెచ్ సి కి వచ్చే రోగులకు టెస్ట్ లు చేపట్టి వచ్చే రిపోర్ట్ ఆధారంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
 
మోతే తహసీల్దార్ కార్యాలయం  తనిఖీ చేసి రికార్డ్స్ నిర్వహణ,ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి త్వరిగతిన దరఖాస్తులను పరిష్కరించి రైతుల సమస్యలు తీర్చాలని అధికారులకు సూచించారు.
 
తదుపరి ఎంపిడిఓ కార్యాలయంలో ప్రజాపాలన హెల్ప్ డెస్క్ ని కలెక్టర్ పరిశీలించి గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాల మార్పులచేర్పులను ఎప్పటికప్పుడు నవీకరించాలని అధికారులకు సూచించారు.WhatsApp Image 2024-07-23 at 17.51.00_d85b63e9
 
 
   ఈ కార్యక్రమంలో మోతే ఎంపిడిఓ హరిసింగ్ నాయక్, తహశీల్దార్ సంఘమిత్ర, మెడికల్ అధికారి నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

 

Read More అందెల శ్రీరాములు యాదవ్ ను కలిసిన ఫోర్త్ సిటీ భూ బాధిత రైతులు