బీటీ రోడ్డు నిర్మించి వీరన్నపల్లి బస్సును పునరుద్ధరించాలి
On
విశ్వాంబర, తలకొండపల్లి, జూలై 27: తలకొండపల్లి మండలం వీరన్న పల్లి గ్రామానికి బస్సును పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే సహకారంతో మూడు కోట్ల 40 లక్షల రూపాయలతో దొంగరోడు నుండి గట్టు ఇప్పలపల్లి వరకు నాలుగు కిలోమీటర్లు బిటి రోడ్డు కు శంకుస్థాపన చేసి అధికారులు శిలాఫలకం కూడా వేశారని వర్షాకాలంతో రోడ్డు గుంతలు గుంతలుగా తయారైనందుకు బస్సు నడపడం పూర్తిగా మహేశ్వరం డిపో బంద్ చేసిందని ప్రజా ప్రతినిధులు ఇకనైనా పట్టించుకుని రోడ్డు వేయించి బస్సు పునరుద్ధరించగలరని వీరన్న పల్లి గ్రామ ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుతున్నారు