సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: కార్పోరేటర్ రాధా ధీరజ్ రెడ్డి. 

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: కార్పోరేటర్ రాధా ధీరజ్ రెడ్డి. 

విశ్వంభర, ఎల్బీనగర్ : సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి అన్నారు. కొత్తపేటలోని శివాని మహిళా కళాశాల  ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథులుగా కార్పోరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, కళాశాల చైర్మన్ డాక్టర్ పి. రామ్ రెడ్డి, సెక్రటరీ, కరస్పాండెంట్ వేధిరె సుదర్శన్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాధా ధీరజ్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతిలోని పూలను దైవంగా కొలిచి బతుకమ్మ పండుగను జరుపుకోవడం తెలంగాణలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. విద్యార్థులకు చదువు మానసిక ఉల్లాసంతో పాటు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కళాశాల యాజమాన్య నిర్వహించడం గొప్ప విషయం అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని నృత్య ప్రదర్శనలతో అలరించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనిత, డైరెక్టర్ ప్రేమ్ నాథ్ రెడ్డి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: