బస్సు ఆపలేదని రోడ్డుకు అడ్డంగా కూర్చుని మహిళ నిరసన 

బస్సు ఆపలేదని రోడ్డుకు అడ్డంగా కూర్చుని మహిళ నిరసన 

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలకు ప్రధాన్యత కల్పిస్తూ కల్పించిన ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కాంగ్రెస్ అధినేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలకు ప్రధాన్యత కల్పిస్తూ కల్పించిన ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కాంగ్రెస్ అధినేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఆర్టీసీ అధికారులు సైతం ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని ఎంతో సజావుగా నిర్వహిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. 

చేయి ఎత్తి బస్సు ఎక్కడ ఆపినా మహిళలకు ఎక్కించుకోవాలని ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయినా ఎక్కడో ఒక చోట మహిళలు బస్సు ఆపితే ఆపకుండా వెళ్లిపోతున్నారు ఆర్టీసీ డ్రైవర్లు. దీంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన వరంగల్‌లో జరిగింది. బస్సు ఆపలేదని ఓ మహిళ బస్సుకు అడ్డంగా కూర్చుని నిరసన తెలిపింది. 

Read More కేంద్రమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి  -

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ-మహబూబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎక్కింది. దివ్యాంగుడైన కుమారుడిని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు దిగింది. అయితే బస్సు డ్రైవర్ ఆమె ఎక్కక ముందే బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆ మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. ఆర్టీసీ అధికారులు ఇకనైనా ఆర్టీసీ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.