సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

 మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్

WhatsApp Image 2024-07-18 at 12.06.40_9cae12f4

విశ్వంభర న్యూస్ : - గురువారం షాద్ నగర్ మున్సిపాలిటీ 20వ వార్డులో  పర్యటిస్తూ మురికి కాలువలు, డ్రైనేజి పనులను పరిశలించిన మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్.ఈ సందర్బంగా మాట్లాడుతూ వర్షాకాలంలో విషజ్వరాలు ప్రబలే అవకాశం అధికంగా ఉంటుందని  తెలిపారు.వ్యక్తిగత పరిశుభ్రతతోనే వ్యాధులను నివారించవచ్చు అన్నారు. వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు వస్తున్నాయి అన్నారు.  సీజనల్‌ వ్యా ధులు రాకుండా సానిటేషన్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలు కురిసిన సమయంలో వర్షం నీరు నిలవకుండా,డ్రైనేజి నిండిన వెంటనే తొలగించేందుకు సిబ్బంది అందుబాటులో ఉండేందుకు చర్యలు చెప్పడతామన్నారు. వార్డుల్లో దోమలు,ఈగలు  నివారించేందుకు కృషి చేస్తామని అన్నారు.బ్లీచింగ్‌ పౌడర్‌,చెత్త వేసిన కుండీల వద్ద ఎప్పటికప్పుడు క్లీన్‌ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అన్ని వార్డుల్లో పరిశుభ్రతను పాటించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు .ఈ కార్యక్రమంలో పినమోని గోపాల్, మున్సిపల్ సిబ్బంది సాయిబాబా, వెంకట్రాంరెడ్డి, జవాన్ ఆంజనేయులు బాబా తదితరులు పాల్గొన్నారు

Read More జాబ్ మేళాలో 14 మంది ఎంపిక