స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమాలు
విశ్వంభర, భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లాలో ఆగస్టు 5 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాలు, పట్టణాలు ప్రజలు, మహిళా సంఘాలు, యువత, ప్రముఖులతో కార్యక్రమం నిర్వహణ ప్రాధాన్యత తెలియచేస్తామని ,పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు.గ్రామ, మున్సిపల్ స్థాయిలో ప్రతి ఇంటి నుండి వ్యర్దాలు సేకరించి, వ్యర్దాలను వర్మీ కంపోస్టు ఎరువులు తయారు చేయాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు, మొక్కల పెంపకం, సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తామని అన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమ నిర్వహణపై అవగాహన కల్పించి
అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.