తెలంగాణ ఉద్యమ గాయకుడు వేముల నరేష్ కు నివాళులు అర్పించిన శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి 

WhatsApp Image 2024-07-21 at 18.08.00 శాలి గౌరారం , విశ్వంభర :-  మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ గాయకుడు & సాంస్కృతిక సారథి కళాకారుడు వేముల నరేష్  ఇటీవల మరణించడంతో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్బంగా నాటి ఉద్యమ కాలంలో జరిగిన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ నరేష్ తెలంగాణ ఉద్యమకళాకారుడిగా ఉద్యమం సమయంలో ఎంతోమందిని చైతన్యపరచాడని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీఇవ్వడం జరిగింది.  ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్, బి ఆర్ ఎస్ నాయకులూ పాల్గొనడం జరిగింది.