గంగూలి రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ..!
రోహిత్ శర్మ సేన ఇప్పుడు వరుసగా టీ20 వరల్డ్ కప్ లో అదరగొడుతోంది. వరుసగా మూడో మ్యాచ్ లోనూ విజయం సాధించింది ఇండియా టీమ్. అయితే ఓపెనర్లు పెద్దగా ఆకట్టుకోకపోయినా.. మిగతా బ్యాట్స్ మెన్లతో పాటు ప్రధానంగా బౌలర్లు దుమ్ములేపుతున్నారు. నిన్న యూఎస్ తో మ్యాచ్ లో ఉత్కంఠ పోరులో ఇండియా గెలిచింది.
అయితే ఈ గెలుపుతో రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐటీటీ మెగా టోర్నీలో భారత్ కు అత్యధిక విజయాలు అందించిన రెండో కెప్టెన్ గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఈ లిస్టులో మాజీ కెప్టెన్ మహీంద్రా సింగ్ ధోనీ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ధోనీ ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీల్లో 58 మ్యాచ్ లకు కెప్టెన్సీ వహించి 40 విజయాలు అందించాడు.
ఇక ఆ తర్వాత మొన్నటి వరకు గంగూలీ 22 మ్యాచ్ ల్లో 16 విజయాలు భారత్ కు అందించి రెండో స్థానంలో ఉండేవాడు. కాగా యూఎస్ తో విజయంతో గంగూలీని అధిగమించాడు రోహిత్. రోహిత్ ఐసీసీ టోర్నీల్లో 17 విజయాలు అందించిన టీమిండియా రెండో కెప్టెన్ గా నిలిచాడు. దాంతో రోహిత్ కు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.