ఫుట్‌బాల్‌కు భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి వీడ్కోలు
భారత ఫుట్‌బాల్ జట్టుకు రెండు దశాబ్దాలుగా వెన్నముకగా నిలిచిన సునీల్ ఛెత్రి కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పాడు. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో కువైట్‌తో మ్యాచ్ తనకు చివరిదని ఇప్పటికే ప్రకటించిన భారత కెప్టెన్ ఛెత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత ఫుట్‌బాల్ జట్టుకు రెండు దశాబ్దాలుగా వెన్నముకగా నిలిచిన సునీల్ ఛెత్రి కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పాడు. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో కువైట్‌తో మ్యాచ్ తనకు చివరిదని ఇప్పటికే ప్రకటించిన భారత కెప్టెన్ ఛెత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం భారత్, కువైట్ జట్ల మధ్య మ్యాచ్ 0-0తో డ్రా అయింది. తన చివరి మ్యాచ్‌లో భారత జట్టును గెలిపించడానికి ఛెత్రి తీవ్రంగా శ్రమించాడు.
అయితే కువైట్ గట్టి పోటీనివ్వడంతో విజయం సాధ్యం కాలేదు. భారత ప్లేయర్స్, ప్రత్యర్థి ఆటగాళ్లు, కోచ్‌లు సునీల్ ఛెత్రికి ఘనమైన వీడ్కోలు పలికారు. చివరిసారిగా ఛెత్రీ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో వచ్చారు. అభిమానుల హర్షధ్వానాల మధ్య ఛెత్రి మైదానంలో తిరుగుతూ ప్రేక్షకులకుఅభివాదం చేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆటగాళ్ల గార్డ్ ఆఫ్ హానర్ మధ్య నిష్క్రమించాడు. ఈ క్రమంలో స్టాండ్స్‌లోని అతని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఛెత్రి 2011లో అర్జున, 2019లో పద్మశ్రీ, 2021లో ఖేల్‌రత్న పురస్కారాలను అందుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఛెత్రి మరో రెండేళ్లు ఇండియన్ సూపర్ లీగ్ బెంగళూరు తరపున ఆడే అవకాశముంది. సునీల్ ఛెత్రి 2005లో జాతీయ సీనియర్ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరఫున 151 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 94 గోల్స్ చేశాడు. ఇందులో నాలుగు హ్యాట్రిక్‌లు ఉన్నాయి. జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన జాబితాలో ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు.