ఒడిశాలో తీవ్ర ఉత్కంఠ.. కొత్త సీఎం ఎవరు..?
ఒడిశా రాజకీయాలు ఇప్పుడు కీలకంగా మారిపోయాయి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో సుదీర్ఘంగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ ఓడిపోయారు. బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి ఒడిశా రాజకీయాలు సంచలన మలుపులు తీసుకుంటున్నాయి.
ఇప్పటికే జేడీయూకు ఆ పార్టీ కీలకనేత వీకే పాండియన్ రాజీనామా చేశారు. ఇటు బీజేపీ నుంచి సీఎం ఎవరు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు వినిపిస్తోంది. కానీ ఆయనతో పాటు పార్టీకి చెందిన కీలక నేతలు అందరూ పోరులోనే ఉన్నారు.
బీజేపీ సీనియర్ నేతలు, సంబిత్ పాత్ర, అపరాజిత సారంగి, ప్రతాప్ సారంగి, గిరీశ్ చంద్ర పేర్లు ముఖ్యమంత్రి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే.. ధర్మేంద్ర ప్రధాన్ మరోసారి కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఒడిశా సీఎం ఎవరనేది మరింత ఉత్కంఠ రేపుతోంది.