నేడు ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర క్యాబినేట్ భేటీ
కేంద్రంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ కొలువుదీరింది. ఆదివారం ప్రధాని మోడీ భారత ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని, మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్రంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ కొలువుదీరింది. ఆదివారం ప్రధాని మోడీ భారత ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని, మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. కాగా, ప్రధాని మోడీ నివాసంలో ఇవాళ(సోమవారం) సాయంత్రం 5గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంది. కొత్తగా ఏర్పాటైన మోడీ ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్న తొలి క్యాబినెట్ భేటీ ఇదే.
ఈ సమావేశానికి ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రులుగా పదవి చేపట్టనున్నవారు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా, న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో మోడీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 71 మంది ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీతో కలిపి 30 మంది కేబినేట్ మంత్రులు, 5 గురు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా), 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.