కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్

కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్

  • హోటల్ బస పేరుతో కేజ్రీవాల్ ‌ఖాతాకు రూ.45కోట్లు
  • ఈడీ వద్ద డాక్యుమెంటరీ ఆధారాలు
  • రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ(గురువారం) విచారించింది. ఈడీ, కేజ్రీవాల్ లాయర్ల తరఫున వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ సీఎం బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ, అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ)ఎస్వీ రాజు, గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ గోవాలోని హోటల్ బస కోసం నేరాల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని రుజువు చేయడానికి ఈడీ వద్ద డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయని వాదించారు.

అదేవిధంగా గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారానికి నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సహ నిందితుడు చన్‌ప్రీత్ సింగ్‌కు ఫోన్ కాల్స్, కాల్ డేటా రికార్డుల (సీడీఆర్) రూపంలో ఫెడరల్ ఏజెన్సీ వద్ద డాక్యుమెంటరీ ఆధారాలు సైతం ఉన్నాయని ఆయన తెలిపారు. వివిధ వ్యక్తుల నుంచి రూ.45కోట్లు నగదు రూపంలో అరవింద్ కేజ్రీవాల్ గోవాలోని హోటల్ బసకు ఆయన ఖాతా నుంచి చెల్లించారని తెలిపారు. ఈ వ్యక్తుల నుంచి రికవరీ చేయబడిన టోకెన్ నంబర్లు అరవింద్ కేజ్రీవాల్‌తో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాయని లా ఆఫీసర్ పేర్కొన్నారు.

Read More రాజ‌కీయాల‌కు లోక్ మంథ‌న్ అతీతం::కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Related Posts