ఎలాన్ మస్క్ వర్సెస్ బీజేపీ.. ఈవీఎంలపై రచ్చ.. 

ఎలాన్ మస్క్ వర్సెస్ బీజేపీ.. ఈవీఎంలపై రచ్చ.. 

 

మస్క్ కు కౌంటర్ ఇస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు
మద్దతు ఇస్తున్న రాహుల్ గాంధీ 

 

ఇప్పుడు దేశంలో ఎలాన్ మస్క్ వర్సెస్ బీజేపీ రగడ సాగుతోంది. అది కూడా ఈవీఎంల మీద. ఎందుకంటే మొన్న ఎలన్ మస్క్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఇండియాలో ఈవీఎంలను రద్దు చేయాలంటూ ఆయన పోస్టు పెట్టారు. ఎందుకంటే వాటిని మనుషులు లేదంటే ఏఐ హ్యాక్ చేసే ప్రమాదం ఉందని.. కాబట్టి వాటిని ఎన్నికల్లో వాడకపోవడం బెటర్ అంటూ తెలిపారు. 

Read More రాజ‌కీయాల‌కు లోక్ మంథ‌న్ అతీతం::కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంటోంది. తాజాగా మస్క్ పోస్టు మీద కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. అసలు సురక్షితమైన డిజిటల్ హార్డ్‌వేర్‌ను తయారు చేయలేరన్నారు.

అసలు ఇండియాలో వాడే ఈవీఎంలకు కస్టమ్-డిజైన్ చేయబడినవి. సురక్షితమైనవి, ఏదైనా నెట్‌వర్క్ లేదా మీడియా నుంచి వేరుచేయబడి ఉంటాయి. పైగా వీటికి ఎలాంటి కనెక్టివిటీ లేదు. బ్లూటూత్, వైఫై, ఇంటర్ నెట్ లాంటివి లేవు. కాబట్టి వాటిని హ్యాక్ చేయడం అసాధ్యం. అంతే కాకుండా అవి రీప్రోగ్రామ్ చేయలేని ఫ్యాక్టరీ-ప్రోగ్రామ్ చేసిన కంట్రోలర్‌లు. కాబట్టి వాటి గురంచి మస్క్ పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే బెటర్ అంటూ ఆయన విమర్శించారు. 

ఇక ఇదే విషయంపై రాహుల్ గాంధీ మరోలా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంలు హ్యాకింగ్​కి గురవుతున్నాయని విపక్షాలు ఎన్నో ఏళ్లుగా ఆరోపిస్తున్నాయి. ఇక ఇప్పుడు.. ఎలాన్​ మస్క్​ సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు. కానీ దాన్ని ఈ దేశంలో విమర్శించడానికి వీల్లేదు. కానీ మన దేశంలో ఎన్నికల పారదర్శకతపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. వ్యవస్థలు జవాబుదారీ తనంగా లేకపోతే మాత్రం.. కచ్చితంగా ప్రజాస్వామ్యం మోసానికి గురవుతున్నట్టే అని రాహుల్ మస్క్ కు మద్దతుగా మాట్లాడారు.  

Related Posts