పరువు నష్టం దావా కేసు.. రాహుల్ గాంధీకి ఊరట

పరువు నష్టం దావా కేసు.. రాహుల్ గాంధీకి ఊరట

గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్‌పై బీజేపీ పరువు నష్టం దావా వేసింది.

గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్‌పై బీజేపీ పరువు నష్టం దావా వేసింది. అయితే, తాజాగా ఈ కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన బెంగళూరు స్పెషల్‌ కోర్టు  బెయిల్‌ మంజూరు చేసింది. 2019-2023 బీజేపీ పాలనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని, ప్రతీ పనిలోనూ 40శాతం కమీషన్ తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. 

రాహుల్‌ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న కర్ణాటక బీజేపీనేతలు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు డీకే శివకుమార్‌, సిద్ధరామయ్య, రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌ నేతలు అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సహా తమ పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కేశవ్‌ ప్రసాద్‌ ఆ పార్టీ తరఫున పరువు నష్టం దావా వేశారు. 40 శాతం కమీషన్‌ ప్రభుత్వం’గా అభివర్ణిస్తూ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇప్పించారని దుయ్యబట్టారు. 

Read More రాజ‌కీయాల‌కు లోక్ మంథ‌న్ అతీతం::కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అదేవిధంగా వివిధ రకాల ఉద్యోగాలకు బీజేపీ ‘రేటు కార్డులు’ పెట్టిందంటూ హస్తం పార్టీ పోస్టర్లు అతికించి తమ పార్టీ పరువుకు భంగం కలిగించిందని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇక ఈ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు గత వారం బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రాహుల్ ఈ కేసులో సహ నిందితుడు కాగా ఆయన విచారణకు హాజరయ్యారు. వాదోపవాదనలు విన్న కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తదుపరి విచారణను జులై 30కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది.

Related Posts