దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా నమోదవుతున్న కేసులు

దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా నమోదవుతున్న కేసులు

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కొత్త కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కొత్త వందల సంఖ్యలో ఈ మహమ్మారి కేసులు నమోదువున్నాయి. దీంతో సర్వాత్ర కలకలం సృష్టిస్తుంది. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో కేపీ-1, కేపీ-2 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కేపీ-1 34 కేసులు, కేపీ-2 వేరియంట్ 290 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కొత్త వేరియంట్లతో భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇవి మరీ అంత ప్రాణాంతకం కాదని తెలిపింది. కానీ.. జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

 

Read More రాజ‌కీయాల‌కు లోక్ మంథ‌న్ అతీతం::కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా విజృంభణ మొదలైంది. చాలా దేశాల్లో కొత్త కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. కొన్ని దేశాల్లో హెల్త్ ఎమర్జెన్సీ కూడా ప్రకటిస్తున్నారు. ప్రపంచం మొత్తం కనుమరుగైన కరోనా తాజాగా సింగపూర్ లో కకావికళం చేస్తోంది. గత వారం రోజుల్లో ఆ దేశంలో 25,900 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశానికి వెళ్లి వస్తున్న వారిపై ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.

 

Read More రాజ‌కీయాల‌కు లోక్ మంథ‌న్ అతీతం::కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మూడేళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని ఈ మహమ్మారి వణికించింది. అప్పట్లో భారత్‌లో చాలా మంది ప్రాణాలు పిట్టల్లా రాలాయి. రోజు 50 వేల కేసులు నమోదయ్యాయి. ఆస్పత్రులు మొత్తం కరోనా రోగులతోనే నిండిపోయాయి. అయితే ఆతర్వాత నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. కానీ మళ్లీ కొత్త కేసులు నమోదవడం ఆందోళనకరంగా మారింది.

Tags:

Related Posts