కామ కోరికలు తీర్చుకోవడానికి అడ్డు వస్తుందని 22 నెలల చిన్నారి దారుణ హత్య
- రెండు జిల్లాల్లో విషాదాన్ని నింపిన చిన్నారి హత్య
- రాసలీలలకు అడ్డుగా ఉందని పసికందు దారుణ హత్య
- ఇద్దరు పిల్లల తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడు
- నిజామాబాద్ జిల్లా నుంచి సూర్యాపేట జిల్లాకు తీసుకొచ్చి దారుణం..
సూర్యాపేట, విశ్వంభర : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని 22 నెలల చిన్నారిని అతి దారుణంగా చిత్రహింసలకు గురిచేసి హత్య చేశాడో కామాంధ ప్రియుడు. నవ మాసాలు మోసి పురిటి నొప్పులు భరించి జన్మనిచ్చిన తల్లి.. ప్రియుడితో గడిపే రెండు క్షణాల ఆనందం కోసం బిడ్డను సైతం చంపుకుంది. ఈ హృదయవిదారక సంఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను చివ్వెంల ఎస్ఐ వెంకట్ రెడ్డి విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన మోత్క సాయిలు, విజయ దంపతుల కూతురు రమ్య అలియాస్ నవ్యశ్రీ (23)ని కొన్నాళ్ల క్రితం గుండారం గ్రామానికి చెందిన కటకట లక్ష్మణ్‌కు ఇచ్చి వివాహాం చేశారు. వీరికి ఇద్దరు కూతుళ్లు జన్మించారు. పెద్దమ్మాయి ఆరుణ్య (4), చిన్న కూతురు మహాన్వి (22 నెలలు). కాగా, రమ్యకు గుండారం గ్రామానికి చెందిన బొల్లెంక అరవింద్ రెడ్డితో ఏడు నెలల క్రితం నుంచి అక్రమసంబంధం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ విషయం గ్రామంలో తెలియడంతో రమ్యను, ఆమె ఇద్దరు కూతుళ్లను తీసుకుని అరవింద్ రెడ్డి 20 రోజుల క్రితం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలపురం గ్రామానికి వచ్చాడు. పిల్లలను నిన్ను చూసుకుంటానని అక్కడే గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టిన ఈ కామంధ ప్రియుడు తమ కామ కోరికలు తీర్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వీరి రాసలీలలకు 22 నెలల చిన్నారి మహాన్వి అడ్డువస్తుందని అరవింద్ రెడ్డి అతి క్రూరంగా వ్యవహరించాడు. పసికందు అనికూడా చూడకుండా చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొరకడంతోపాటు తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా శరీరమంతా కాల్చి తీవ్రంగా కాల్చి వాతలు పెట్టిగాయపరిచాడు. అయినా కోపం తగ్గని అరవింద్ రెడ్డి మంగళవారం రాత్రి చిన్నారి నిద్రిస్తుండగా తలను నేలకేసి కొట్టి హత్య చేశాడు. అయితే ఈ సమయంలో రమ్య తన పెద్ద కూతురిని తీసుకుని కిరాణ దుకాణం వద్దకు వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికివచ్చే సరికి మహాన్వి చనిపోయి ఉండటం.. అరవింద్ రెడ్డి పరారీ కావడంతో షాక్‌కు గురైంది. బుధవారం ఉదయం ఈ దారుణ ఘటనను రమ్య తన మేనత్త కటికల గంగమణికి తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జరిగిన దారుణంపై గంగమణి చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సీఐ సురేందర్ రెడ్డి, ఎస్ఐ వెంకట్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మహాన్వి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించి ప్రియుడు బొల్లెంక అరవింద్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.