ప్రియాంక గాంధీ కూతురుపై అలాంటి పోస్ట్ చేసిన నెటిజన్.. ఎఫ్ఐఆర్ నమోదు?
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కుమార్తె మిరయా గాంధీపై ఓ వ్యక్తి చేసినటువంటి అనుచిత పోస్ట్ సంచలనంగా మారింది. ప్రియాంక గాంధీ కుమార్తె మిరయా పేరు మీద ఏకంగా 3000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అంటూ అనూప్ వర్మ అనే నెటిజన్ చేసిన ఈ పోస్ట్ సంచలనంగా మారింది.
ఇలా ప్రియాంక గాంధీ కుమార్తె గురించి ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయటం అంటే వారి వ్యక్తిగత గౌరవాన్ని కించపరచడమేనని ,అలాగే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలా నిరాధారమైనటువంటి పోస్ట్లు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ నేతలు అనూప్ వర్మ పై ఎఫ్ఐఆర్ కి నమోదు చేశారు.కాంగ్రెస్ కార్యకర్త ప్రమోద్ గుప్తా ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.అయితే అనూప్ వర్మ ఐడీ పరిశీలించగా ఐఏఎఫ్ ఫ్లైట్ లెఫ్టినెంట్, డిఫెన్స్ అనలిస్టునని ట్విట్టర్ ఖాతాలో చెప్పుకున్నాడని వివరించారు. ఇకపై ఎవరైనా ఆధారాలు లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని వెల్లడించారు.