నగల వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఆదిత్య బిర్లా గ్రూప్

ఆభరణాల వ్యాపారం కోసం రూ.5000 కోట్ల పెట్టుబడి

 గ్రూప్ యొక్క ఆభరణాల బ్రాండ్, ఇంద్రియ, జాతీయ స్థాయిలో మొదటి మూడు సంస్థలలో  ఒకటిగా వుండాలని లక్ష్య

WhatsApp Image 2024-07-27 at 12.58.53 హైద్రాబాద్ , విశ్వంభర :-  ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్, కుమార్ మంగళం బిర్లా, ఈ రోజు గ్రూప్ యొక్క జ్యువెలరీ రిటైల్ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు.  దీని ద్వారా వేగంగా విస్తరిస్తున్న రూ.6.7 లక్షల కోట్ల భారతీయ ఆభరణాల మార్కెట్‌లో గ్రూప్‌ ప్రవేశించినట్లయింది. ' ఇంద్రియ'  బ్రాండ్‌తో ప్రారంభించబడిన ఆభరణాల వ్యాపారం ద్వారా, రాబోయే 5 సంవత్సరాలలో భారతదేశంలోని అగ్రశ్రేణి మూడు ఆభరణాల రిటైలర్‌ లలో ఒకరిగా స్థానం సంపాదించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక వెంచర్ కోసం భారీ స్థాయిలో రూ. 5,000 కోట్ల పెట్టుబడిని సంస్థ పెట్టనుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా మాట్లాడుతూ, “ ఈ సంవత్సరం పెయింట్‌లు మరియు ఆభరణాల రంగాలలో ప్రవేశించాము.  ఆభరణాల రంగం అనధికారిక నుండి అధికారిక రంగం వైపు మారుతుండటంతో పాటుగా విశ్వసనీయ బ్రాండ్‌లకు పెరుగుతున్న వినియోగదారుల ప్రాధాన్యత మరియు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న వివాహ మార్కెట్ కారణంగా ఆభరణాల వ్యాపారంలోకి ప్రవేశించడం తప్పనిసరిగా మారింది. 20 ఏళ్లుగా ఫ్యాషన్ రిటైల్ మరియు లైఫ్ స్టైల్ పరిశ్రమలో కొనసాగుతున్న గ్రూప్‌కి ఆభరణాల రంగం లోకి ప్రవేశించటం  సహజమైన విస్తరణ" అని అన్నారు. ఇంద్రియ ఇప్పుడు ఢిల్లీ, ఇండోర్ మరియు జైపూర్ నగరాల్లో నాలుగు స్టోర్లను తెరవనుంది. ఆరు నెలల్లో 10+ నగరాలకు విస్తరించాలనేది ప్రణాళిక.  జాతీయ బ్రాండ్‌ల సగటు పరిమాణం కంటే 30%-35% పెద్దగా 7000 చదరపు అడుగులకు పైగా పరిమాణపు స్టోర్‌లు ప్రారంభించనున్నారు. ఈ బ్రాండ్ 5,000 ప్రత్యేక డిజైన్‌లతో 15000 కు పైగా ఆభరణాల శ్రేణి అందిస్తుంది. ప్రతి 45 రోజులకు కొత్త కలెక్షన్లు ప్రవేశపెట్టబడతాయి. నోవెల్ జ్యువెల్స్ డైరెక్టర్  దిలీప్ గౌర్ మాట్లాడుతూ, “ఇంద్రియ ద్వారా, సృజనాత్మకత,సాంకేతికత  ఆభరణాల రంగంలో కస్టమర్ అనుభవంలో ప్రమాణాలను పునర్నిర్వచించటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఆభరణం పనితనం యొక్క ప్రత్యేకమైన కథను చెబుతుందని అర్థం చేసుకోవడంపై ఇది నిర్మించబడింది"అని అన్నారు. నోవెల్ జ్యువెల్స్ సీఈఓ సందీప్ కోహ్లి మాట్లాడుతూ, "ఆభరణాలనేవి ఇప్పుడు ఒక స్టేట్మెంట్ గా మారుతున్నాయి. ఇంద్రియలో అత్యంత కీలకంగా  ప్రత్యేకమైన లాంజ్ , సిగ్నేచర్ అనుభవాలు ఉంటాయి.  స్టోర్ లోపలి  స్టైలిస్ట్‌లు మరియు నిపుణులైన జ్యువెలరీ కన్సల్టెంట్‌లు అసాధారణ  షాపింగ్ అనుభవాలను అందించనున్నారు" అని అన్నారు.

 

Read More ఆగస్టు 9న జరిగే ఢిల్లీలో మాదిగల మహాధర్నా ను విజయవంతం చేయాలి.