ఇంట్లో అలిగి హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన భర్త

ఇంట్లో అలిగి హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన భర్త

ఇంట్లో భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి ఏకంగా హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఈ సంఘటన సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగింది.

ఇంట్లో భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి ఏకంగా హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఈ సంఘటన సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉండే మోహన్ బాబు(25) మద్యం మత్తులో శంకేశ్వర్ బజార్ చౌరస్తా సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి గందరగోళం చేశాడు.

గమనించిన స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మోహన్ బాబు స్తంభం మీదే కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ అక్కడున్న వారందరినీ ఆందోళనకు గురిచేశాడు. గంటన్నర పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరకు పోలీసులే స్తంభం ఎక్కి సముదాయించి కిందకు దించారు. ఇతడు రెండేళ్లలో ఐదుసార్లు ఇలా విద్యుత్ స్తంభం ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. భార్య తిట్టినా, కోపం వచ్చినా ఇలాంటి పనులు చేస్తాడని చెప్పారు.

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

Related Posts