పుష్ప-2 నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్..!

పుష్ప-2 నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్..!

అల్లు అర్జున్ పుష్ప-2 విడుదలకు ముందు ప్రచార చిత్రాలు, పాటలు, ప్రోమోలతో సినిమాలో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.  ఈ రెండో సాంగ్ ని మే 29న 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

అల్లు అర్జున్ పుష్ప-2 విడుదలకు ముందు ప్రచార చిత్రాలు, పాటలు, ప్రోమోలతో సినిమాలో ఆసక్తిని పెంచుతోంది. దేవీశ్రీప్రసాద్ ఈ సినిమాకు పాటలు అందిస్తున్న విషయం తెలిసిందే. తొలి పాటతోనే పుష్పకు మించి పుష్ప-2 పాటలు ఉన్నాయంటున్నారు అభిమానులు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఓ గ్లింప్స్, ఒక పాట విడుదల చేసింది మూవీ టీమ్. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. 

ఈ ప్రోమోలో సాంగ్ సెట్ లో రష్మిక మేకప్ వేసుకుంటుంటే కేశవా వచ్చి.. ‘‘శ్రీవల్లి వదిన.. పుష్ప 2 నుంచి రెండో పాట రిలీజ్ చేస్తున్నారంట కదా.. ఆ పాటేందో చెప్తావా..’’ అని అడగ్గా.. రష్మిక.. ‘‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి.. ’’అని పాడింది. ఇక ఈ రెండో సాంగ్ ని మే 29న 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇది అల్లు అర్జున్, రష్మిక కపుల్ సాంగ్ అని తెలిపారు. 

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ అభిమానులు పుష్ప 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  పుష్ప టైటిల్ సాంగ్ రాసిన రైటర్ చంద్రబోస్ ఈ పాటకూ లిరిక్స్ అందించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇలా తదితర భాషల్లో పుష్ప 2 సినిమా ఆగస్టు 15న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

Related Posts